ప్రాణం తీసిన అప్పులు - నాటు తుపాకీతో కాల్చుకుని వ్యక్తి ఆత్మహత్య - Man Suicide with Gun - MAN SUICIDE WITH GUN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 6, 2024, 1:38 PM IST
Man Commits Suicide Shoot Himself with Gun : అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి కుటుంబ సభ్యులు చూస్తుండగానే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు అధికం కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే, జిల్లాలోని చిన్నమండెం మండలం బోనముల గ్రామానికి చెందిన రాజ గోపాల్ (50) ఇటుకల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సంబేపల్లి మండలం ముదినేనివాండ్లపల్లెలో నాటు తుపాకితో తనకు తాను గొంతు కింద కాల్చుకోవడంతో తల చెల్లాచెదురైంది. ఈ ఘటన కుటుంబ సభ్యులు చూస్తుండగానే చోటు చేసుకోవడంతో పిల్లలు భయాందోళనకు గురయ్యారు. రాజగోపాల్ అనారోగ్యం, అప్పులు అధికం కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం నాటు తుపాకిని స్వాధీనం చేసుకొని ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. బలవన్మరణం చేసుకున్నాడా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, నాటు తుపాకీ మృతుడికి ఎలా వచ్చింది అనే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.