పార్టీకి నష్టం జరుగుతుందంటే తగ్గేందుకు సిద్ధం: మహాసేన రాజేష్ - Mahasena Rajesh Withdrew Elections
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 3, 2024, 11:44 AM IST
Mahasena Rajesh Says Will Withdraw from the Contest for Party: వైసీపీ కార్యకర్తలు తనపై చేస్తున్న దుష్ప్రచారం తెలుగుదేశం-జనసేనపై ప్రభావం పడకుండా ఉండేందుకు పోటీ నుంచి వైదొలుగుతానని కోనసీమ జిల్లా పి.గన్నవరం టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ ప్రకటించారు. ఒక సామాన్యుడికి అవకాశం వస్తే వ్యవస్థ ఎలా ఏకమైపోతుందో రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకోవాలన్నారు. వైసీపీ నుంచి నిందితులు పోటీ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన తప్ప పదవుల కావాలని ఎప్పుడు ఆలోచించలేదన్నారు. తన వల్ల పార్టీకి నష్టం జరుగుతుందంటే తాను తగ్గడానికి సిద్ధమని మహాసేన రాజేష్ స్పష్టం చేశారు.
పి. గన్నవరం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పార్టీ అధిష్ఠానం మహాసేన రాజేష్ పేరును ఖరారు చేసిన విషయం అందరికి తెలిసిందే. పరిస్థితులు పరిశీలించాక పోటీ నుంచి తప్పు కోవాలన్న నిర్ణయానికి వచ్చానని మహాసేన రాజేష్ వెల్లడించారు. రెండు పార్టీల నుంచి రాజేష్‌కు సరైన మద్ధతు లేకపోవడం వల్లనే ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.