మా అభివృద్ధికి చంద్రబాబు కృషి - ఆగస్టు 16న మాదిగల కృతజ్ఞతా యాత్ర : పేరు పోగు వెంకటేశ్వరరావు - MADIGAla THANKSGIVING YATRA - MADIGALA THANKSGIVING YATRA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 5:53 PM IST

Madigala Thanksgiving Yatra on August 16th : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే మాదిగలు సమగ్రాభివృద్ధి చెందుతారని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు (MRPS State President Perupogu Venkateswara Rao) కర్నూలులో అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తామని చెప్పడమే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించినందుకు ఆగస్టు 16వ తేదీ మాదిగల కృతజ్ఞతా యాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ యాత్రకు సంబంధించిన కరపత్రాలను మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ. కృష్ణమూర్తి సమక్షంలో ఆవిష్కరించారు. ఈ యాత్ర హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు కొనసాగనుంది. 

1996 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి, 2000 సంవత్సరంలో వర్గీకరణ చేయడం వల్ల మాదిగలు ఎంతగానో అభివృద్ధి చెందారని వెంకటేశ్వరరావు తెలిపారు. వర్గీకరణకు అడ్డంకులు రావడంతో రద్దు చేశారని అన్నారు. కుప్పం సభలో చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని చెప్పడంతో మాదిగలు హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో నిలిచిపోయిన దళితుల సంక్షేమ పథకాలు తెలుగు దేశం పార్టీ పునఃప్రారంభం చేస్తామని చెప్పడం సంతోషంగా ఉందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.