మాచర్ల మున్సిపాలిటీ టీడీపీ కైవసం- టీడీపీ తీర్థం పుచ్చుకున్న16 మంది కౌన్సిలర్లు - Macherla Municipal New Chairman - MACHERLA MUNICIPAL NEW CHAIRMAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2024, 8:32 PM IST
Macherla Municipality 16 Councilors Joined TDP From YSRCP : పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీపై తెలుగుదేశం జెండా ఎగిరింది. 16 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. కొత్త కౌన్సిల్ ఏర్పాటుకు వీలుగా వారం క్రితం ఛైర్మన్ ఏసోబు రాజీనామా చేశారు. దీంతో వైస్ ఛైర్మన్‌గా ఉన్న పోలూరు నరసింహారావును ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి సూచన మేరకు కౌన్సిలర్లు కొత్త ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. మాచర్ల మున్సిపల్ ఛైర్మన్‌గా పోలూరు నరసింహారావు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో నరసింహారావు తెలుగుదేశంలో చేరారు.
గత ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యాలు, బెదిరింపులతో మున్సిపాలిటీలోని 31 స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడం, జూలకంటి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే కావడంతో మాచర్ల మున్సిపాలిటీలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. అంతా కలిసి కట్టుగా పనిచేసి మాచర్ల మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని నూతన ఛైర్మన్ నరసింహారావు, ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి సూచించారు.