'మీరంతా వైసీపీకే ఓటు వేయాలి'- 'మే వేయం' : లారీ ఓనర్స్ యూనియన్‌లో ఘర్షణ - LORRY UNION - LORRY UNION
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-04-2024/640-480-21229227-thumbnail-16x9-lorry-union.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 15, 2024, 4:58 PM IST
Lorry Union President Pressured to Support YCP Candidate Dwarampudi : కాకినాడ జిల్లా లారీ యూనియన్ కార్యాలయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. లారీ యజమానులు అందరూ వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా నిలవాలని యూనియన్ అధ్యక్షుడు ఎస్ రాజు వారిపై ఒత్తిడి తెచ్చారు. అయితే కొంత మంది లారీ యజమానులు తమకు ఇష్టమైన నాయకుడికి ఓటు వేస్తామని సృష్టం చేశారు. దీంతో వైసీపీ అనుకూల వర్గీయులు వారిపై వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
Kakinada District : ద్వారంపూడికి అనుకూలంగా ఓటు వేయాలని తమపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని లారీ యజమానులు వాపోయారు. తమకు సంబంధించిన సరుకు రవాణాకు సకాలంలో అనుమతించకపోవడం లేదని లారీ యజమానులు వాపోయారు. దీంతో తమకు చాలా వరకు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మద్ధతు ఇవ్వాలని యూనియన్ అధ్యక్షుడు వత్తిడి తెచ్చారని పేర్కొన్నారు.