మహానందిలో గోశాల వద్ద చిరుతపులి సంచారం - భయాందోళనలో భక్తులు - Leopard Migration in Mahanandi - LEOPARD MIGRATION IN MAHANANDI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 27, 2024, 9:13 PM IST
Leopard Migration in Mahanandi: నంద్యాల జిల్లా మహానందిలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఇప్పటికి పలు మార్లు చిరుత పులి సంచారం సీసీ కెమెరాలో రికార్డు అయింది. తాజాగా శనివారం తెల్లవారు జామున చిరుత పులి మహానంది ఆలయ సమీపంలో గోశాల వద్ద కనపడింది. మహానంది ఆలయ సమీపంలోని గోశాల వద్దకు వచ్చి చిరుతను చూసి భక్తులు బెంబేలెత్తారు. గోశాల చుట్టూ కట్టిన గ్రీన్ మాట్ వద్ద పదేపదే చిరుత తిరుగుతూనే ఉంది. ఆ గ్రీన్‌మాట్ చుట్టూ చిరుత తిరగడంతో భక్తులు పరుగులు తీశారు. కొంతకాలంగా ఆలయ పరిసరాల్లో సంచరిస్తున్న చిరుత కదలికలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. మహానంది ఆలయ పరిసరాల్లోకి చెంతనే ఉన్న నల్లమల అడవుల్లో నుంచి గ్రామంలోకి చిరుత పులి వస్తుందని స్థానికులు చెప్తున్నారు. కొన్ని పశువులను సైతం చిరుత చంపిందని స్థానికులు తెలిపారు. కొన్ని రోజుల కిందట బహిర్భూమికి వెళ్లిన యువకుడిపై చిరుత దాడి చేసి గాయపరిచినట్లు స్థానికులు తెలిపారు. త్వరగా చిరుతను బంధించాలని భక్తులు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.