నంద్యాలలో మహిళను చంపిన చిరుత బోనుకు చిక్కింది - Leopard Caught in Pacharla - LEOPARD CAUGHT IN PACHARLA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 8:23 PM IST
Leopard Caught near Pacharla Village in Nandyal District: నంద్యాల జిల్లా శిరివెళ్ళ మండలం పచ్చర్ల గ్రామ ప్రజలకు కొన్ని రోజులుగా కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. గ్రామ సమీపాన అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులోకి వచ్చి చిరుత బంధించబడింది. బంధించిన చిరుతను తిరుపతి జంతు ప్రదర్శనశాలకు ప్రత్యేక వాహనంలో అధికారులు తరలించారు. ఇటీవల కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన మెహరున్నీషా అనే మహిళపై చిరుత దాడి చేయగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అంతకంటే ముందు ఇదే చిరుత దాడిలో మరో ముగ్గురు గాయపడ్డారు. ఎట్టకేలకు చిరుత చిక్కడంతో గ్రామస్థులంతా ఊపిరి పీల్చుకున్నారు.
Prakasam District: ఇటీవల ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం దేవనగరం సమీపంలో పది అడుగుల గుంతలో చిరుత చిక్కుకుంది. ఆ చిరుతను అటవీశాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి రక్షించారు. దాదాపు 28 గంటలపాటు గుంతలో ఉన్న చిరుతకు ఆహారం, నీరు అందించి సురక్షితంగా బయటకు తీసి బంధించారు.