మాకు ప్రాధాన్యత ఇవ్వరా ? - సీఎం సభలో అవమానం జరిగిందంటున్న లాయర్లు - Law University Bhumi Pujan program
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 14, 2024, 7:44 PM IST
Law University Bhumi Puja program : సీఎం సభలో తమకు అవమానం జరిగిందంటూ నాయ్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లా యూనివర్సిటీ భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన తమకు కాకుండా వైఎస్సార్సీపీ నేతలకు ప్రాముఖ్యత ఇవ్వడంపై సీనియర్ లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి పూజ కార్యక్రమంలో లాయర్లకు ప్రాధాన్యత ఇవ్వరా అంటూ న్యాయవాదులు మండిపడిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
కర్నూలులో నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ సభలో గందరగోళం నెలకొంది. కర్నూలు సమీపంలోని జగన్నాథ గట్టుపై జాతీయ న్యాయ యూనివర్సిటీకి భూమి పూజా కార్యక్రమంలో తమకు అవమానం జరిగిందని సీనియర్ లాయర్లు నిరసన చేశారు. భూమి పూజా కార్యక్రమంలో తమను వెనకాల కూర్చొబెట్టి వైకాపా నేతలకు వీఐపీ పాసులు ఇవ్వడం ఏంటని సీనియర్ న్యాయవాదులు, కర్నూలు జిల్లా బార్ అధ్యక్షుడు నాగభూషణ్ నాయుడు అధికారులను నిలదీశారు. తమను మీటింగ్‌కు పిలిచి అవమానించారని న్యాయవాదులు బయటకు వెళ్లే ప్రయత్నం చేయగా స్పందించిన అధికారులు వారిని ముందు వరుసలో కూర్చోబెట్టారు. దీంతో సభ ప్రారంభానికి ముందే కొంతసేపు గందరగోళం నెలకొంది.