ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది: న్యాయవాదులు - Lawyers on AP Land Titling Act - LAWYERS ON AP LAND TITLING ACT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 9, 2024, 1:07 PM IST
Lawyers Interview on AP Land Titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తోందని న్యాయవాదులు ధ్వజమెత్తారు. నేరం జగన్ చేసి ఆ తప్పు కేంద్రంపై నెడుతున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం రాష్ట్రంలోనే అమలు చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం ఈ యాక్ట్‌కు దూరంగా ఉంటే జగన్ మాత్రం స్వార్థ బుద్ధితో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల భూములపై యజమాన్య హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదకరమైన జగన్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న న్యాయవాదులతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి.
"ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది. నేరం జగన్ చేసి నెపం కేంద్రంపై నెడుతున్నారు. సీఎం జగన్ స్వార్థ బుద్ధితో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రమాదకరమైన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం." - న్యాయవాదులు