జగన్ ఫొటో ఎందుకు? - ల్యాండ్ టైటిలింగ్‌తో మా భూములు కాజేయాలని చూస్తున్నారన్న రైతులు - FARMERS ABOUT LAND TITLING ACT
🎬 Watch Now: Feature Video
Land Titling Act Interview With Anakapalli Farmers: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ తమ భూములను కాజేయాలని చూస్తున్నారని రైతులు ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై అనకాపల్లి జిల్లా రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ చట్టం అమలు కోసం ప్రయత్నించడం దారుణమని రైతులు మండిపడ్డారు. చట్టంపై అవగాహన కల్పించకుండా దాచిపెట్టి వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. తమ ఆస్తి పత్రాలపై జగన్ ఫొటో వేసుకోవడం ఏంటని రైతులు ప్రశ్నించారు. వైసీపీ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. జగన్ రైతుల జీవితాలను నాశనం చేయడానికే ఈ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు.
భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఛార్జీలు విపరీతంగా పెంచేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో భయాందోళనకు గురవుతున్నామని రైతులు తెలిపారు. భూములను అన్యాక్రాంతం చేసుకోవడానికే జగన్ ఈ చట్టాన్ని తీసుకొచ్చారని రైతులు విమర్శించారు. భూహక్కు చట్టమనేది చాలా దుర్మార్గమైనదిగా భావిస్తున్నామని రైతులు పేర్కొన్నారు. ఎన్నికల్లో జగన్‌ను ఓడించాలని అంతా నిర్ణయించుకున్నామని రైతులు స్పష్టం చేశారు.