8 భారీ కూలింగ్ టవర్స్ - సెకన్ల వ్యవధిలో కూల్చివేత - వీడియో వైరల్ - Cooling Towers Demolished Video - COOLING TOWERS DEMOLISHED VIDEO
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 5, 2024, 10:22 AM IST
Palvancha Thermal Plant Cooling Towers Demolished Video : తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ ఆపరేషన్ అండ్ మెయింట్‌నెన్స్ కర్మాగారం కూలింగ్ టవర్లను అధికారులు తొలగించారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు చెందిన ఎగ్జిక్యూట్ అనే ప్రైవేట్ సంస్థ టవర్ల పేల్చివేత ప్రక్రియను నిర్వహించింది. ఓఎంఎం కర్మాగారం మూతపడడంతో ఆ ప్రాంతంలోని కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు టవర్లను పేల్చివేయాలని యాజమాన్యం నిర్ణయించింది.
Palvancha Cooling Towers Demolished Video : ఈ నేపథ్యంలో పాత కర్మగారానికి సంబంధించిన ఎనిమిది కూలింగ్ టవర్లను అధికారులు తొలగించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఎగ్జిక్యూట్ అనే ప్రైవేట్ సంస్థ ఎనిమిది కూలింగ్ టవర్లను కూల్చి వేసింది. కొద్ది రోజుల్లో కూల్చి వేసిన కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని శుభ్రం చేయనున్నారు. దీంతో కూలింగ్ టవర్లు నెలకొల్పిన ప్రాంతం కేటీపీఎస్కు ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు. టవర్ల కూల్చివేత సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు.