వైఎస్సార్సీపీకి చివరి రోజులు దగ్గర పడ్డాయి : చీరాల తెదేపా ఇన్‌ఛార్జ్ కొండయ్య - బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 4, 2024, 1:28 PM IST
Kondaiah Comments on YSRCP Government in Bapatla District : వైసీపీ పాలనకు చివరి రోజులు దగ్గర పడ్డాయని చీరాల తెలుగుదేశం ఇన్‌ఛార్జ్ ఎమ్.ఎమ్ కొండయ్య ఎద్దేవా చేశారు. సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టడం సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనకు పరాకాష్ఠ అని మండిపడ్డారు. బాపట్ల జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురంలో " బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారంటీ " కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు రాజకీయ గుర్తింపు ఇచ్చిన ఏకైక పార్టీ టీడీపీనే అని కొండయ్య వెల్లడించారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలపై దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన దాని కంటే దోచుకో దాచుకో అన్నట్లుగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి ప్రజలందరు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మార్చి 5న మంగళగిరిలో జరిగే జయహో బీసీ కార్యక్రమానికి చీరాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు.