వైఎస్సార్సీపీ ప్రభుత్వం మా వృత్తిని నాశనం చేసింది - జగన్ ఒక్క హామీ నెరవేర్చలేదు : కల్లుగీత కార్మికులు - Narasimha Murthy
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 4:39 PM IST
Kallugeeta Workers Rally in West Godavari : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయంలో కల్లుగీత కార్మికులను సర్వ నాశనం చేశారని రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘ అధ్యక్షుడు నరసింహమూర్తి వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి తణుకులో కల్లుగీత కార్మికులు 15వ మహాసభలను నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. కల్లుగీత కార్మికులు ఉపయోగించే మోకులు, ఇతర పరికరాలతో ర్యాలీని చేపట్టారు. 20 జిల్లాలకు చెందిన కల్లుగీత కార్మికుల సంఘాల అధ్యక్షులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
President of Kallugeeta Karmak Sangham Narasimha Murthy : ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ కూడా అమలు చేయలేదని నరసింహమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి తమకు ఇచ్చిక హామీలను నెరవేర్చకుండా తమ వర్గాన్ని సర్వనాశనం చేశారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అయితే కల్లుగీత కార్మికుల డిమాండ్లను మ్యానిఫెస్టోలో పెట్టుతుందో ఆ పార్టీకే ఓటు వేస్తామని సృష్టం చేశారు.