అదరహో అనిపించేలా సాగిన కళాంజలి ఫ్యాషన్‌ షో - Kalanjali Fashion Show - KALANJALI FASHION SHOW

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 6, 2024, 10:57 AM IST

Kalanjali Fashion Show in Chittoor District : చిత్తూరులో ఫియస్తా కార్యక్రమంలో భాగంగా కళాంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్‌ షో పట్టణవాసులను అలరించింది. శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువతీ యువకులు కళాంజలి వస్త్రాలను ధరించి ర్యాంప్‌ వాక్‌ చేశారు. విద్యార్థుల హావభావాలతో కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. పాశ్చాత్య యువతకు అనువైన డిజైనర్లతో విద్యార్థులు ప్రదర్శించారు. అదరహో అనిపించేలా సాగిన ఈ ప్రదర్శనను కళ్లార్పకుండా చిన్నా పెద్దలు తిలకించారు.  హీరోయిన్ నిధి అగర్వాల్  

తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వారి నమ్మకాన్ని నిలబెట్టాలి : విద్యార్థి జీవితం తిరిగి రానిదని, అదే సమయంలో లక్ష్యం నిర్దేశించుకుని చదవాలని హీరోయిన్ నిధి అగర్వాల్ పేర్కొన్నారు. పుత్తూరులోని ఎస్వీపీసెట్లో శుక్రవారం ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలని తెలిపారు. మంచిగా చదివి వారి నమ్మకాన్ని నిలబెట్టాలని అన్నారు. ప్రతి విద్యార్థి తన కలల సాకారానికి కృషి చేయాలని సూచించారు. ప్రతిభ సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.