అమరావతిలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు ప్రారంభం - Jungle Clearance Works in Amaravati - JUNGLE CLEARANCE WORKS IN AMARAVATI

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 10:18 AM IST

Jungle Clearance Works in Amaravati : పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ఆధ్వర్యంలో రాజధాని అమరావతి ప్రాంతంలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు ప్రారంభమయ్యాయి. రాజధానిలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్లు ఇచ్చేందుకు వీలుగా ఈ జంగిల్‌ క్లియరెన్స్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. గడచిన ఐదేళ్లుగా ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవటంతో ప్రభుత్వ భవనాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు, సచివాలయ, హెచ్డీ ఐకానిక్‌ టవర్లు, ఎన్జీఓ భవనాలు తదితర ప్రాంతాల్లో ముళ్ల పొదలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. రాజధాని ప్రాంతంలోని 217 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో దాదాపు 70 శాతం మేర ప్రాంతంలో ఈ ముళ్లపొదలు, తుప్పలు పెరిగిపోయాయి. వీటిని తొలగించేందుకు సీఆర్డీఏ అధికారులు 250కుపైగా పొక్లెయిన్లు వినియోగిస్తున్నారు. నెల రోజుల్లో 23,429 ఎకరాల్లో విస్తరించిన ముళ్లచెట్లు, పొదలు తొలగిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. 

ఈ పొదలను, తుప్పలను తీసివేస్తేనే డక్ట్‌లు, డ్రెయిన్లు, రహదారుల వంటి పనుల్ని చేపట్టేందుకు వీలు కలగనుంది. గతంలో టీడీపీ హయాంలో భూములు కేటాయించిన వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు సైతం జంగిల్‌ క్లియరెన్స్‌ చేసి తమకు కేటాయించిన స్థలాలను అప్పగించాలని కోరాయి. దీంతో రాజధాని ప్రాంతంలో ఈ ముళ్ల పొదల తొలగింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 36 కోట్ల రూపాయలను వెచ్చించి వీటిని తొలగించేందుకు టెండర్లను పిలిచింది. ఎన్సీసీ కంపెనీ ఈ టెండర్లను దక్కించుకుంది. ప్రత్యేక పూజల పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ  పనులు ప్రారంభించారు.

"వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాటతో అమరావతిని ధ్వంసం చేసింది. 54 వేల ఎకరాల రాజధాని ప్రాంతంలో ముళ్లపొదలతో చిట్టడవిగా తయారైంది. దాదాపు 23,429 ఎకరాల్లో ప్రస్తుతం ముళ్లపొదలు తొలగిస్తున్నాం. రాజధానిలో స్వయంగా సీఎం పర్యటించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భూమి త్యాగం చేసిన రైతులకు కౌలు, కూలీలకు పింఛన్‌ కొనసాగిస్తాం." -నారాయణ, మంత్రి 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.