ఎంవీవీ, జీవీ ఇద్దరూ వేల కోట్ల భూములు కొట్టేశారు: మూర్తియాదవ్ - JSP Leader Murthy Media Conference - JSP LEADER MURTHY MEDIA CONFERENCE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 15, 2024, 4:43 PM IST
JSP Leader Murthy Yadav Media Conference in Visakha: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన స్నేహితుడు జీవీ ఇద్దరూ కలిసి వేల కోట్లు విలువైన పేదల భూములు కొట్టేశారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఎన్‌ఆర్‌ఐ భూములను సైతం గ్యాంగ్‌స్టర్లతో చేతులు కలిపి బెదిరించి రాయించుకున్నారని విమర్శించారు. ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఉదంతంలో కీలక నిందితుడు వెంకట్‌కు వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యుల కిడ్నాప్ జరిగి సంవత్సరం అయిందని దీనిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎందుకు విచారణ చేయలేదో చెప్పాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. కుటుంబాన్ని అడ్డుపెట్టుకొని ఎంవీవీ సానుభూతి పొందాలని చూస్తున్నారని మూర్తి వ్యాఖ్యానించారు. కిడ్నాప్ నిందితులకు విలువైన భూములు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎంవీవీ సత్యనారాయణ ఎంపీ కాక ముందు ఆ తరవాత ఆస్తులను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఎంవీవీ టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావును సైతం బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటిపై మళ్లీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.