జల్ ప్రహార్ సంయుక్త విన్యాసాలు- యుద్ధ సన్నద్ధత నైపుణ్యాలపై క్షేత్ర స్దాయిలో ప్రదర్శన - ఆర్మీ నేవీల సంయుక్త విన్యాసాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2024, 12:29 PM IST

Joint Naval Jal Prahar Exercises Since Last Ten Days at visakha: జల్ ప్రహార్ పేరిట పదాతిదళం, నౌకాదళ సంయుక్త విన్యాసాలు పది రోజుల పాటు కొనసాగాయి. ఆర్మీ, నేవీల మధ్య సమన్వయం కోసం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ తరహా విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉభయచర విన్యాసాలుగా నేలపైనా, నీటిపైనా, నీటి లోపల కూడా చేశారు. ఆర్మీ, నేవీ బృందాల మధ్య సమన్వయం పెంచే దిశగా ఈ విన్యాసాలు చేపట్టారు. ఈ నెల 22 నుంచి ఆరంభమైన విన్యాసాలు విశాఖ తూర్పు తీరం నుంచి కాకినాడ వరకు ప్రదర్శించారు. 

బంగాళాఖాతంలో జరిగిన ఈ జల్ ప్రహార్ విన్యాసాలు ఉభయచర ఆర్మీ, నేవీ శౌర్యానికి దర్పణంగా నిలిచాయి. ఆర్మీ నుంచి మద్రాస్ రెజిమెంట్ సైనికులు, నేవీ నుంచి తూర్పు నౌకాదళం నావికులు ఇందులో పాల్గొని తమ సత్తాను చాటుకున్నారు. నీటిలోనూ, నేలపైనా యుద్ద సన్నద్దత క్షేత్ర స్దాయిలో నైపుణ్యాలపై విన్యాసాలు చేశారు. యుద్ద నౌకలోకి నేరుగా ఆర్మీ వాహనాలు అన్ని పంపించి మళ్లీ వాటిని అవసరమైన చోట ఎలా దించుకోవాలనే వాటిపై సాధన చేశారు. మరికొన్ని సంక్షిష్టమైన యుద్ద ప్రక్రియలను సిబ్బంది సాధన చేసినట్లు పేర్కొన్నారు

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.