పోతుల బాలకోటయ్య గృహ నిర్భంధం- ఎన్డీయేకు మద్ధతివ్వడమే కారణమా?! - Potula Balakotaiah House Arrest

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 8, 2024, 4:09 PM IST

thumbnail
పోతుల బాలకోటయ్య గృహ నిర్భంధం- ఎన్డీయేకు మద్ధతివ్వడమే కారణమా?! (ETV Bharat)

JAC Leader Potula Balakotaiah House Arrest : కృష్ణా జిల్లా అమరావతి  బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్యను అయన స్వగ్రామమైన కంచికర్లలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా క్రోసూరులో తెలుగుదేశం అభ్యర్థులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు, భాష్యం ప్రవీణ్ ఎన్నికల సభకు వెళ్తుండగా పోలీసులు గృహ నిర్భంధం చేశారని బాలకోటయ్య ఆరోపించారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం గత కొన్ని రోజులుగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే హస్ అరెస్ట్​లు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

బాలకోటయ్య గత కొన్ని రోజులుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరితో పాటు ఎన్నికల ప్రచారం కూడా చేశారు. దళిత నేతగా ఉన్న ఆయనను హౌస్ అరెస్టు చేయటం విడ్డూరంగా ఉందని బహుజన జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ఈ అరెస్టు ఎందుకో, ఏమిటో చాలా విచిత్రంగా ఉందని బాలకోటయ్య అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.