అంతరిక్ష పరిశోధనకు సిద్దమైన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-D3 - రేపే ప్రయోగం - ISRO Scientist visit Tirumala - ISRO SCIENTIST VISIT TIRUMALA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 15, 2024, 10:44 AM IST
ISRO Scientist visit Tirumala With SSLV D3 Satellite-8 Model : ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. రేపు (August 16) శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ప్రయోగించనున్న ఎస్‌ఎస్‌ఎల్‌వీ (SSLV) - D3 శాటిలైట్-8 నమూనాకు గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం తీసుకున్నారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ నెల 16న శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న ఎస్‌ఎస్‌ఎల్‌వీ (స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్) రూపకల్పనలో హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్ క్రియాశీలక పాత్ర పోషించింది. ఈ లాంచ్ వెహికల్‌కు స్టేజ్-1 రాకెట్ మోటార్, ఎస్3ఏ అడాప్టర్, ఇంకా కొన్ని ముఖ్యమైన స్ట్రక్చర్లు అందించడమే కాక, అసెంబ్లింగ్ పనులూ నిర్వహించింది. ‘లాంచ్-ఆన్-డిమాండ్’ పద్ధతిలో ‘లో ఎర్త్ ఆర్బిట్’లో 500 కిలో తరగతికి చెందిన ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఎస్‌ఎస్‌ఎల్‌వీ ఎంతో అనుకూలమైనదిగా గుర్తింపు సాధించిన విషయం విదితమే.