నడవలేని స్థితి అయినా కుటుంబం, గురువుల సహకారంతో సివిల్స్ సాధించా : 887వ ర్యాంకర్ హనిత - Interview with UPSC Ranker Hanitha - INTERVIEW WITH UPSC RANKER HANITHA
🎬 Watch Now: Feature Video
Published : Apr 16, 2024, 6:55 PM IST
Interview with UPSC Ranker Hanitha : విధి వంచించినా విశ్వాసం ఆమెను నిలబెట్టింది. కాళ్లు కదలకపోయినా పట్టువిడవని సంకల్పం తనను కదిలించింది. ఊహించని అనారోగ్యం ఇంటికే పరిమితం చేసినా ఇంట్లో నుంచి కదల్లేక కళాశాలకు దూరమైంది. అయినా చదువును మాత్రం ఏనాడు వీడలేదు. దూరవిద్య పూర్తిచేసి కుటుంబం, గురువుల సహకారంతో దేశంలోనే అత్యున్నత కొలువులకు ఎంపికయ్యారు విశాఖపట్నానికి చెందిన హనిత.
UPSC Ranker Hanitha about Civils : తాజాగా వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 887 ర్యాంకు సాధించి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. రెండు మూడేళ్ల పాటు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నానని, 18 ఏళ్ల వయసులో అనారోగ్యానికి గురయ్యానని హనిత తెలిపారు. దూరవిద్యలో చదువు పూర్తి చేసి సివిల్స్‌కు సన్నద్ధత అయినట్లు చెప్పారు. నాల్గో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు సాధించానని, విద్యారంగంపై ఎక్కువ అసక్తి ఉందని తెలిపారు. అందరికీ నాణ్యమైన విద్య అందించాలనేది తన లక్ష్యమంటున్న సివిల్స్ విజేత హనితతో ఈటీవీ భారత్ ముఖాముఖి.