దౌత్య పాత్రలో భారత్ ముందడుగు: సీజీఎస్‌ విక్టరీ నౌక మారిషష్‌కు అందజేత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 2:16 PM IST

thumbnail

India handed over Coast Gaurd Victory ship to Mauritius: భారత నౌకాదళం దౌత్య పాత్రలో మరో ముందడగు నమోదు చేసుకుంది. మారిషస్ కోస్ట్ గార్డు నౌక ఎంసీజీఎస్ (Mauritius Coast Gaurd Ship ) విక్టరీని విశాఖ తీరంలో తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్‌ లాంఛనంగా అప్పగించారు. మారిషస్ తరుఫున ఆ దేశ ప్రతినిధి పోలీస్ చీఫ్ అనిల్ కుమార్ డిప్ (Police Chief Anil Kumar Dip) స్వీకరించారు.

మిలన్ 2024 కోసం వచ్చిన మారిషష్ బృందాని (Mauritius Team)కి పోలీసు ఫోర్స్ చీఫ్ అనిల్ కుమార్ డిప్ నేతృత్వం వహిస్తున్నారు. భారత్ నౌకాదళం నుంచి పూర్తి సహాయ సహకారాలు తమకు అందుతున్నాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ నౌక కోస్టల్ పెట్రోలింగ్, యాంటీ పైరసీ, యాంటీ స్మగ్లింగ్, యాంటీ-డ్రగ్ నిఘా వంటి మల్టీరోల్ కార్యకలాపాల కోసం రూపొందించారు. యాంటీ-పోచింగ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం మారిషస్ వినియోగిస్తోంది.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.