325 మద్యం సీసాలు స్కానింగ్‌ - ఎస్​ఈబీ అధికారులకు చిక్కిన అధికారి - illegal liquor seized - ILLEGAL LIQUOR SEIZED

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 19, 2024, 3:23 PM IST

Illegal Liquor Case Mangalagiri Guntur District : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా ప్రభుత్వ మద్యం దుకాణంలో ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. దామోదర్​ రెడ్డి అనే ఉద్యోగి తన పేరుతో 325 మద్యం సీసాలను స్కానింగ్ చేసి పక్కన పెట్టుకున్నట్లు అధికారులకు ఎవరో సమాచారం అందించారు. దీంతో అధికారులు అతని ఇంట్లో సోదాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగి స్కానింగ్​ చేసిన మద్యం సీసాలను సెబ్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

శుక్రవారం మంగళగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిని మురుగుడు లావణ్య నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో ఈ మద్యం సీసాలను భద్రపరిచినట్లు ఉద్యోగి వెల్లడించినట్లు సమాచారం. ఈ ఘటనపై సెబ్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను విచారణ చేసిన అనంతరం మీడియాకి వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎవరు అక్రమంగా మద్యం నిలువ ఉంచిన వారిని అరెస్టు చేసి తీరుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.