భావితరాలకు నిజానిజాలను తెలియజేసేందుకే విమోచన దినోత్సవ వేడుకలు : బండి సంజయ్ - Hyderabad Liberation Day 2024 - HYDERABAD LIBERATION DAY 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 1:21 PM IST

Hyderabad Liberation Day 2024 : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌, ఎంపీలు ఈటల రాజేందర్‌, కె.లక్ష్మణ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమర జవాన్ల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం కిషన్‌ రెడ్డి జాతీయ జెండా ఎగుర వేసి, భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణ విమోచన దినోత్సవ చరిత్రను గత పాలకులు వక్రీకరించారని అన్నారు. భావితరాలకు నిజానిజాలను తెలియజేసేందుకే కేంద్ర ప్రభుత్వం మూడేళ్లుగా విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తుందని తెలిపారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఏ కులానికో, మతానికో సంబంధించినది కాదని ఆయన అన్నారు. తెలంగాణ పోరాటాలకు పురిటి గడ్డ అని, ఈ గడ్డ మీద పుట్టడం గర్వకారణమని సంజయ్ వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా పని చేసి, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.