కార్ల స్టాక్‌ యార్డులకు వరద ఎఫెక్ట్​ - నీటమునిగిన వాహనాలు - Huge Cars Damage in Mustabad - HUGE CARS DAMAGE IN MUSTABAD

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 9:36 PM IST

Car Stock Yards Was Water logged in Mustabad : కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ముస్తాబాద్‌లో కార్ల స్టాక్‌ యార్డులు జలమయమయ్యాయి. బుడమేరు వరద ధాటికి పెద్ద సంఖ్యలో మోటారు వాహనాల షోరూంలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. టాటా మోటార్స్‌ స్టాక్‌ యార్డులోని కార్లు, ఆటోలు, లారీలు నీట మునిగాయి. వరద మెల్లగా తగ్గుముఖం పట్టడంతో వాహనాలు బయటకు కనిపిస్తున్నాయి. వరదల వల్ల భారీ నష్టం వాటిల్లినట్లు షోరూం యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. 

స్టాక్​ యార్డు ప్రాంతానికి చేరుకోవడానికి ఇంకా పూర్తి స్థాయిలో మార్గం మెరుగుపడలేదు. ఇంకా నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. నగరంలో ఇంకా చాలా చోట్ల వరద ప్రవాహాం పూర్తిగా తగ్గలేదు. విజయవాడలో వరదల వల్ల ఏపీఎస్​ ఆర్టీసీకి కూడా భారీ నష్టం వాటిల్లింది. వరదతో విద్యాధరపురం, ఇబ్రహీంపట్నం బస్‌ డిపోలు జలమయమయ్యాయి. విద్యాధరపురం డిపోలో 40 బస్సులు, ఇబ్రహీంపట్నం బస్ డిపోలో 20 బస్సులు నీటిలో మునిగాయి. దీంతో విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీ సిబ్బంది కుటుంబంతో సహా వరదలో చిక్కుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.