డబ్బు కోసం డీఈ వేధింపులు - భరించలేక హౌసింగ్ ఏఈ ఆత్మహత్యాయత్నం - Housing AE SUICIDE ATTEMPT - HOUSING AE SUICIDE ATTEMPT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 27, 2024, 3:06 PM IST
Housing Department AE Suicide Attempt to Authorities Harassment : సత్యసాయి జిల్లా ధర్మవరంలో గృహనిర్మాణ సంస్థ కార్యాలయంలో ఏఈగా పని చేస్తున్న బాలాజీ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గృహ నిర్మాణ కార్యాలయంలో కొంతకాలంగా ఉన్నతాధికారులు తనను డబ్బు కోసం వేధిస్తున్నారని బాలాజీ పేర్కొన్నారు. అందుకే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినట్లు అతను తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం బాలాజీని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
తన భర్తను గృహనిర్మాణ సంస్థ డీఈ వేధింపులకు గురి చేస్తున్నారని బాలాజీ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్త ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి డీఈ, అతనితోపాటు పని చేస్తున్న మరో ముగ్గురు కారణమని బాలాజీ భార్య వనిత పేర్కొంది. ఏం తప్పు చేశారో చెప్పకుండా నా భర్తని రెండు నెలలుగా సస్పెండ్ చేశారని ఆమె తెలిపింది. ధర్మవరంలో జరిగిన ఈ ఘటనతో గృహనిర్మాణ శాఖలో కలకలం రేగింది. ఈ విషయంపై మంత్రి సత్యకుమార్, నారా లోకేశ్ స్పందించాలని ఆమె కోరారు.