విశాఖలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన - కొనసాగుతున్న ఏర్పాట్లు - Anitha on Chandrababu Visakha Tour - ANITHA ON CHANDRABABU VISAKHA TOUR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 10, 2024, 1:15 PM IST
Home Minister Vangalapudi Anitha Reveiw on CM Chandrababu Visakhapatnam Tour : ఉమ్మడి విశాఖ జిల్లాలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను అనిత, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్టన్,ఎస్పీ మురళికృష్ణ, ఇతర అధికారులు మంగళవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఎటువంటి లోపాలు ఉండకూడదని హోం మంత్రి అనిత జిల్లా ఉన్నత అధికారులకు సూచించారు. సీఎం పర్యటన దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను హోం మంత్రి ఆదేశించారు.
CM Chandrababu Visakhapatnam Tour on July 11th : హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం దార్లపూడి సమీపంలో ఉన్న పోలవరం ఎడమ కాలువను చంద్రబాబు పరిశీలించనున్నారని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం సందర్శించి అనంతరం పనుల తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని, దీంతో పాటు పరవాడ వద్ద మెడిటెక్ పరిశ్రమకు సంబంధించి వివరాలను సమంత అధికారులను అడిగి తెలుసుకుంటారని పేర్కొన్నారు. సీఐఐ కాన్ఫరెన్సు అనంతరం మెడ్ టెక్ జోన్ వర్కర్లతో సమావేశమవుతారని అన్నారు. భోగాపురం నుండి విశాఖపట్నం చేరుకోని విశాఖలో పలు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారని అన్నారు.