LIVE : సచివాలయంలో హోం మంత్రి అనిత మీడియా సమావేశం - Home Minister Anitha Live - HOME MINISTER ANITHA LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 4, 2024, 2:08 PM IST
|Updated : Jul 4, 2024, 2:33 PM IST
Home Minister Anitha Live : రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ధృడ నిశ్చయంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, మంత్రులు వరుసగా అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రల నుంచి గంజాయి అక్రమ రవాణా జరగకుండా చెక్‌పోస్టుల వద్ద కట్టడి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా డ్రగ్స్, మానవ అక్రమ రవాణాలపై పూర్తి నిఘా పెంచాలన్నారు. గంజాయిని కట్టడి చేసే నార్కోటిక్ సెల్‌ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గంజాయిని అణచివేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని హోం మంత్రి అనిత తెలిపారు. ఒక్క విశాఖలోనే గంజాయి అక్రమ రవాణా చేస్తూ 1252 మంది మీద కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. చింతపల్లి ,మాడుగుల, ఇతర ఏజెన్సీ ఒడిశా నుంచి రవాణా అవుతుంటే, కేవలం మూడు చెక్ పోస్టులు మాత్రమే ఉన్నాయని అందుకే యథేచ్ఛగా గంజాయి వస్తోందన్నారు. ఈ క్రమంలోనే సచివాలయం ఐదో బ్లాక్‌లో గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణకు మంత్రుల సబ్ కమిటీ తొలి భేటీ అయింది. హోంమంత్రి అధ్యక్షతన లోకేశ్, కొల్లు, సత్యకుమార్. సంధ్యారాణి సభ్యులుగా కమిటీలో ఉన్నారు. ఈ సమావేశానికి డీజీపీ, సీఐడీ, ఇంటెలిజెన్స్ అదనపు డీజీలు, సెబ్ డైరెక్టర్ హాజరయ్యారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలను హోం మంత్రి అనిత మీడియాకు వెల్లడిస్తున్నారు.
Last Updated : Jul 4, 2024, 2:33 PM IST