thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 21, 2024, 1:10 PM IST

Updated : Jul 21, 2024, 1:50 PM IST

ETV Bharat / Videos

LIVE జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే- హోం మంత్రి మీడియా సమావేశం లైవ్ - Home Minister Anitha on YSRCP Govt

Home Minister Anitha Press Meet Live: సైకో జగన్ పాలనలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ప్రజలందరికీ తెలుసని హోం మంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. కొన్ని అరాచక శక్తులు తమ ప్రభుత్వ హయాంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని ప్రజలకు తెలుసన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలతో పాటు సాధారణ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేసారు. గడచిన ఐదేళ్లలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని తెలిపారు. ఎక్కడా చూసిన అక్రమ కేసులు, నిర్బందకాండ, ప్రతిపక్షాల అణచివేత, సాధారణ పౌరులపై కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునేలా గత పాలకులు వ్యవహరించారని మండిపడ్డారు. అలాగే ఎస్సీలపై దాడులు, హత్యలు జరిగాయని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి నేతలే ఇబ్బందులు పడ్డారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన భారీ విజయాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఇప్పటికీ ఓర్చుకోలేక పోతున్నారని అనిత దుయ్యబట్టారు. ఈ క్రమంలో లా అండ్ ఆర్డర్ గురించి జగన్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనంటున్న హోంమంత్రి అనిత మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం.
Last Updated : Jul 21, 2024, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.