తిరుమలలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా - Home Minister Amit Shah - HOME MINISTER AMIT SHAH

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 10:32 PM IST

home minister amit shah tirumala visit: శ్రీవారి దర్శనార్థం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తిరుమలకు విచ్చేశారు. ముందుగా తిరుమల వకుళమాత అతిథి గృహం వద్దకు చేరుకున్న ఆయనకు, తితిదే ( TTD ) ఈవో ధర్మారెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ రాత్రికి అమిత్ షా తిరుమలలోనే బస చేయనున్నారు.  శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని తిరుగు ప్రయాణం కానున్నారు. అమిత్ షా తిరుమల పర్యటనలో భాగంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. 

 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో  కేంద్ర మంత్రి అమిషా తీరిక లేకుండా దేశమంతా సుడిగాలి పర్యటనలు చేశారు. ఒక్కో రోజు 3 నుంచి 5 సభల్లో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ (Election Schedule) ప్రకటించిన తర్వాత నుంచి రెండున్నర నెలల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పైగా ర్యాలీలు నిర్వహించారు. తిరుమలకు వచ్చిన అమిషాను తిరుపతి బీజేపీ నేతలు మర్యాదపుర్వకంగా కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై నేతలు అమిషాకు వివరించే ప్రయత్నం చేశారు.    

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.