LIVE : విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించిన హోం మంత్రి - ప్రత్యక్షప్రసారం - Home Minister Anitha Live - HOME MINISTER ANITHA LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 2:03 PM IST
|Updated : Jul 2, 2024, 2:15 PM IST
Home Minister Anitha Live : వైఎస్సార్సీపీ పాలన అంత అధ్వానంగా ఉందని, నేటికీ విశాఖ జిల్లాలో ఒక పోలీస్టేషన్ రేకుల షెడ్లో నడుస్తుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నుంచి ఏడాదికి 50 కోట్లు చొప్పున 250 కోట్లు పోలీసుశాఖకు రావాలని, ఈ ఐదేళ్లల్లో ఈ నిధులు ఎందుకు ఇవ్వలేదని మంత్రి అనిత నిలదీశారు. ఇప్పుడు జీరో నుంచి తాము పని చేయాల్సిన పరిస్థితి అని అన్నారు. ఎస్కార్ట్ వాహనాలు కూడా పని చేయడం లేదని తనకు ఫిర్యాదు చేస్తున్నారన్నారు.2014లో ఇచ్చిన వాహనాలే ఇప్పటికీ వాడుతున్నారని, పేపర్, పెన్ను ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని అన్నారు. నేడు నిధుల కొరత వల్ల పోలీసులకు విధుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఎటువంటి శిక్షణ లేకుండా సచివాలయాల్లో మహిళా పోలీసులు ఉన్నారని, వారు ఏవిధంగా పోలీసు విధులు చేయగలరని ప్రశ్నించారు. సీఐడీ విభాగంలో నార్కో టెక్ పరీక్షలు ఒక భాగమని, గంజాయి రవాణాను పోలీసులు నియంత్రణ చేయలేదన్నారు. తాజాగా విశాఖ కేంద్రకారాగారాన్ని హోం మంత్రి అనిత సందర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతున్నారు.
Last Updated : Jul 2, 2024, 2:15 PM IST