టెట్, డీఎస్సీ పరీక్షలపై హైకోర్టులో ముగిసిన వాదనలు - తీర్పు రిజర్వు - Tet DSC Notification in AP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 29, 2024, 10:37 AM IST

High Court Reserved Judgment on TET and DSC Exams: టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య సముచిత సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ ప్రకటించారు. ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ నియామక పరీక్షల నిర్వహణ మధ్య తగిన సమయం లేకుండా టెట్‌ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8న ఇచ్చిన నోటిఫికేషన్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈనెల 12న ఇచ్చిన నోటిఫికేషన్‌లను సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం.పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో వ్యాజ్యం వేసి నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరారు. 

ఈ వ్యాజ్యంపై హైకోర్టు తుది విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది శరత్‌చంద్ర వాదనలు వినిపించారు. సిలబస్‌ ఎక్కువ ఉండటం వల్ల పరీక్షలకు సిద్ధపడేందుకు తగిన సమయం లేదని దీనివల్ల అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్లను రద్దు చేసి, పరీక్షల మధ్య తగిన సమయం ఉండేలా తిరిగి నోటిఫికేషన్‌ ఇచ్చేలా ఆదేశించాలన్నారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది వీకే నాయుడు వాదనలు వినిపించారు. సముచిత సమయం ఇచ్చామన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.