పిన్నెల్లి బెయిల్ 20 వరకు పొడిగింపు- హైకోర్టులో విచారణ వాయిదా - Pinnelli Bail Petition Adjourned - PINNELLI BAIL PETITION ADJOURNED
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 13, 2024, 7:35 PM IST
High Court on Pinnelli Ramakrishna Reddy Bail Petition: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణ అనంతరం హైకోర్టు ఈనెల 20వ తేదీకి ఈ కేసును వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతాయని హైకోర్టు తెలిపింది. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంతో పాటు పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుల్లో పిన్నెల్లికి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రామకృష్ణారెడ్డిపై నమోదైన కేసులలో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13వరకు పొడిగించిన విషయం తెలిసిందే. పూర్తి స్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో ఇరువైపు న్యాయవాదుల సమ్మతి మేరకు విచారణను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ వాయిదా వేశారు.