భూహక్కు చట్టంపై హైకోర్టులో విచారణ - కౌంటర్ దాఖలుకు మరో 2 వారాల సమయం - go number 512 andhra pradesh
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2024, 10:42 PM IST
High Court Hearing on AP Land Titling Act: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ హక్కు చట్టాన్ని (AP Land Titling Act) రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లపై హైకోర్టులో విచారణ చేపట్టారు. కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాలు గడువు ఇచ్చినా ప్రభుత్వం ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వై. బాలాజీ కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలుకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో కౌంటర్ దాఖలుకు న్యాయస్థానం 2 వారాలు సమయం ఇచ్చింది.
అయితే ఈలోగా ప్రభుత్వం యాక్ట్‌ను అమలు చేసే అవకాశముందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. యాక్ట్ అమలు చేస్తే అత్యవసర పిటిషన్ దాఖలు చేసేందుకు పిటిషనర్‌కు అవకాశం ఇస్తామని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది.
కాగా ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ గత కొన్నినెలలుగా న్యాయవాదులు కోరుతున్నారు. భూ హక్కుల చట్టానికి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో తమ నిరసనను సైతం తెలిపారు. ప్రజల హక్కులను, ఆస్తులను హరించే విధంగా ఈ చట్టం ఉందని న్యాయవాదులు మండిపడుతున్నారు. భూ సమస్యలు పరిష్కరించే బాధ్యతలు రెవెన్యూ అధికారులకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.