ఎడతెరిపి లేని వానలతో కొత్తందం సంతరించుకున్న జలపాతాలు - మీరూ ఓ లుక్కేయండి - Flood Flow at Telangana Waterfalls

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jul 21, 2024, 3:09 PM IST

Heavy Flood Flow at Telangana Waterfalls : ములుగు జిల్లా చీకుపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని తెలంగాణ నయాగారాగా పేరొందిన బొగత జలపాతం హోరెత్తించే జల సవ్వడులతో వెండి వెలుగులు విరజిమ్ముతోంది.  తెలంగాణ - ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు అడవి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకల నుంచి భారీగా వరద ప్రవాహం పెరగడంతో బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. తెల్లటి పాలనురుగులా వచ్చే జల ధారలు  పర్యటకులను కనువిందు చేస్తున్నాయి. బొగత జల సోయగాలను తిలకించేందుకు సందర్శకులు పోటెత్తారు. 

మరోవైపు కుంటాల జలపాతం సైతం కొత్త అందాలు సంతరించుకుంది. జోరువానలకు భారీగా వరద ప్రవాహం జతకలిసి జలపాతంలో జలసవ్వడి హోరెత్తుతోంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని పొచ్చెర, గాయత్రి జలపాతాలూ ఎగిసిపడుతున్నాయి. వర్షాల నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు మూడు రోజుల పాటు పర్యటకులకు అనుమతిని నిలిపివేశారు. జలపాతానికి వచ్చిన పర్యాటకుల కదలికలను అధికారులు గమనిస్తున్నారు. ఎవరూ వాటర్‌ఫాల్‌లోకి దిగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.