హనుమంత వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల విహారం - Hanumantha Vahana Seva
🎬 Watch Now: Feature Video
Hanumantha Vahana Seva: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం రాత్రి విశేషమైన హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీ సీతా రామలక్ష్మణులు ప్రియభక్తుడైన హనుమంత వాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి దర్శించుకున్నారు.
త్రేతాయుగంలో రామభక్తునిగా, శ్రీ రాములవారి భక్తుల్లో అగ్రగణ్యుడిగా ప్రసిద్ధిగాంచిన వారు హనుమంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం ద్వారా తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతి ప్రసాదిస్తారని నమ్మకం. దాస భక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓలు శ్రీ నటేష్ బాబు, శ్రీ శివ శంకర్, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.