గత ప్రభుత్వ నిర్వాకంతో హంద్రీనీవాకు నీటి కొరత - 350 క్యూసెక్కుల మాత్రమే విడుదల - Handri Neeva Canal

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 7:44 PM IST

thumbnail
గత ప్రభుత్వ నిర్వాకంతో హంద్రీనీవాకు నీటి కొరత - 350 క్యూసెక్కుల మాత్రమే విడుదల (ETV Bharat)

Handri Neeva Project Not Fully Supplied With Water : శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండిపోయి లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నా రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీరు అందని దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి పూర్తిస్థాయిలో నీటిని అందించాల్సి ఉన్నా కేవలం 350 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. కర్నూలు -ఆత్మకూరు జాతీయ రహదారి పనుల కోసం గతేడాది హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాల్వను గుత్తేదారు పూడ్చేశారు. జులై రెండో వారానికే హెచ్ఎన్ఎస్ఎస్​కు నీరు అందుతున్నా అధికారులు నీటిని విడుదల చేయలేదు. 

ప్రభుత్వం నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉండటం మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. తాత్కాలికంగా కాల్వలో పైపులు ఏర్పాటు చేసి ఒక పంపు ద్వారా మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. కనీసం 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. హంద్రీనీవా నీటిని 120 రోజుల్లో 40 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.