గుణదల మేరీ మాత శతాబ్ది ఉత్సవాలు - భారీగా తరలిరానున్న భక్తులు - Gunadala Mary Matha Celebrations
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2024/640-480-20702776-thumbnail-16x9-gunadala-mary-matha-100-years-celebrations.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 8, 2024, 10:01 PM IST
Gunadala Mary Matha 100 Years Celebrations in AP : విజయవాడ గుణదల మేరీ మాత 100 వసంతాల వేడుకలు ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో మూడు రోజులు పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఫాదర్ మువ్వల ప్రసాద్ తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని చెప్పారు. వారికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. గురువారం(ఈరోజు) గుణదల సోషల్ సర్వీస్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మువ్వల ప్రసాద్ మాట్లాడుతూ, రేపటి నుంచి మూడు రోజుల పాటు గుణదల లూర్దు మాత వేడుకలు జరుగుతాయని తెలిపారు. శుక్రవారం ఉదయం దివ్యబలి పూజతో ఉత్సవాలు వైభవంగా ప్రారంభమవుతాయని వివరించారు.
మూడు రోజులపాటు ప్రతిరోజు సమిష్టి దివ్యబలి పూజతో పాటు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మేరీ మాతను ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయని, ప్రజలందరూ ఈ 100 వసంతాల వేడుకలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతం గుణదల లూర్దు మాత 100 వసంతాల వేడుక పోస్టర్ను ఆవిష్కరించారు.