ఒంగోలులో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద కాల్పులు కలకలం - ఒకరు మృతి - Gun Firing Near EVM strong room - GUN FIRING NEAR EVM STRONG ROOM
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-06-2024/640-480-21616517-thumbnail-16x9-gun-firing-at-evm-strong-room.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 2, 2024, 1:31 PM IST
Gun Firing Near EVM Strong Room: ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. జీతం వచ్చిన రోజే డబ్బులడిగాడనే ఆగ్రహంతో కుమారుడిని తుపాకీతో కాల్చి చంపాడు ఓ తండ్రి. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీస్ కానిస్టేబుల్ తన కుమారుడిపై కాల్పులు జరపడంతో అతడు మృతిచెందాడు. త్రిపురాంతకం గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు కేటాయించారు.
ఇందులో భాగంగా ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ వద్ద కానిస్టేబుల్ ప్రసాద్ రాత్రి డ్యూటీ చేసేందుకు కుమారుడిని వెంటబెట్టుకుని వచ్చారు. తండ్రికి జీతం పడిన విషయం తెలుసుకుని ఆ డబ్బులు ఇవ్వాలంటూ కుమారుడు శేషుకుమార్ ఒత్తిడి తీసుకువచ్చాడు. డబ్బులు విషయంలో ఇద్దరి మధ్య మాటా మాట పెరగడంతో శేషుకుమర్‌పై తండ్రి ప్రసాద్ తుపాకితో కాల్పులు జరిపాడు. తీవ్రగాయలపాలైన కుమారుడిని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా మార్గ మధ్యలోనే శేషుకుమార్ మృతి చెందాడు. శేషుకుమార్ మృతదేహం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు.