నా ఓటు పోయింది ఏ అధికారీ స్పందించరేం? - గుడివాడలో ఓటరు ఆందోళన - A Person Lost Vote in Gudivada - A PERSON LOST VOTE IN GUDIVADA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 10:59 AM IST

Gudivada Constituency A Person Protest For His Lost Vote: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఓటు పోయిందంటూ ఓ వ్యక్తి ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. పెద్దఎరుకాపాడుకు చెందిన వాసుపల్లి విజయ్ కుమార్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా ఓటరు జాబితాలో తన పేరు లేదని ఆందోళన చేస్తున్నారు. తన ఓటు పోవడానికి కారణం ఏమిటని సచివాలయ సిబ్బందిని, ఏ అధికారిని అడిగినా సమాధానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు మరో రెండు రోజులే ఉండగా ఇప్పటికీ ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అధికారుల తీరు చూస్తుంటే ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయనే నమ్మకం కలగడం లేదని వాపోతున్నారు. ఇదిలా ఉండగా డబుల్​ ఓట్ల దందా ఇంకా కొనసాగడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రేపో మాపో ఎన్నికలు జరగనుండగా ఇప్పుడు కూడా అధికారులు ఇలా వ్యవహరిస్తే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తన సమస్య పరిష్కరించాలని బాధిత వ్యక్తి డిమాండ్​ చేశాడు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.