టీచర్ల బదిలీ ఉత్తర్వులు నిలిపివేత- అవినీతి ఆరోపణలపై విచారణ! - TEACHERS TRANSFER ORDERS cancel - TEACHERS TRANSFER ORDERS CANCEL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 6, 2024, 4:51 PM IST
Teachers transfers orders: ఉపాధ్యాయుల బదిలీలపై ఎన్నికల కోడ్ కు ముందు ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేశారు. ఎటువంటి బదిలీలూ చేపట్టొద్దని డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలకు ముందు మొత్తంగా 1800 మంది టీచర్ల బదిలీలు చేశారు. పైరవీలు, సిఫార్సులతో ఈ బదిలీలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. సీఎం పేషీలోని కొందరి అధికారుల ఒత్తిడితో ఈ సిఫార్సులు జరిగాయనే అభియోగం ఉంది. ఈ బదిలీలపై విచారణ చేపట్టే అవకాశం ఉంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు దొడ్డిదారిన ఉపాధ్యాయుల బదిలీలు జరిగినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మంత్రి వెన్నంటి ఉండే ఓ ఉద్యోగి ఇందులో చక్రం తిప్పారని తెలిసింది. బదిలీ కోసం సిఫార్సు లేఖకు కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు 50 వేల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సిఫార్సు లేఖ నుంచి బదిలీ ఉత్తర్వులు పొందే వరకు ఒక్కో ఉపాధ్యాయుడు 4లక్షల నుంచి 5లక్షల రూపాయల వరకు చెల్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.