కొత్త క్యాబినెట్‌ మంత్రులకు ఛాంబర్‌లు కేటాయింపు - Allotting chambers to ministers

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 18, 2024, 10:52 PM IST

thumbnail
కొత్త క్యాబినెట్‌ మంత్రులకు ఛాంబర్‌లు కేటాయింపు - ఆదేశాలు జారీ చేసిన సాధారణ పరిపాలనశాఖ (ETV Bharat)

Government Issued orders Allotting Chambers to Ministers : రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన క్యాబినెట్‌లోని మంత్రులకు ఛాంబర్‌లు కేటాయిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీచేసింది. డిప్యూటీ సీఎంతో సహా మంత్రులకు సాధారణ పరిపాలన శాఖ ఈరోజు ఛాంబర్లను కేటాయించింది. బ్లాక్-2లో ఏడుగురు మంత్రులకు, బ్లాక్-3లో ఐదుగురు మంత్రులకు, బ్లాక్-4లో ఎనిమిది మంది మంత్రులకు, బ్లాక్-5లో ఐదుగురు మంత్రులకు ఛాంబర్లను కేటాయించారు. బ్లాక్-2లో డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు నాదెండ్ల, నారాయణ, దుర్గేష్, అనిత, పయ్యావుల, ఆనంలకు ఛాంబర్ల కేటాయించారు.

అదేవిధంగా బ్లాక్-3లో మంత్రులు గొట్టిపాటి, కొల్లు, సంధ్యారాణి, డోలా, ఎన్ఎడీ ఫరూక్ లకు ఛాంబర్ల సాధారణ పరిపాలన శాఖ కేటాయించింది. అలాగే బ్లాక్-4లో అనగాని, అచ్చెన్న, సవిత, టీజీ భరత్, లోకేష్, రాం ప్రసాద్ రెడ్డి, కొలుసు, నిమ్మలకు ఛాంబర్ల కేటాయించారు. బ్లాక్-5లో బీసీ జనార్జన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి, సత్యకుమార్ లకు సాధారణ పరిపాలన శాఖ ఛాంబర్ల కేటాయించింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.