ఆగిన గాలింపు చర్యలు - మూడు రోజులుగా వెతుకుతున్నా లభించని బాలిక ఆచూకీ - Search operation Stopped - SEARCH OPERATION STOPPED
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 12, 2024, 7:14 PM IST
Girl Missing Search Operation Stopped in Nandyal District : నంద్యాల జిల్లాలో కనిపించకుండా పోయిన బాలిక కోసం చేపట్టిన గాలింపు చర్యలు ఈరోజు ఆపేశారు. జిల్లాలో పగిడ్యాల మండలానికి చెందిన ఐదో తరగతి బాలిక ఆదివారం నుంచి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా బాలిక కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. మూడు రోజుల పాటు ముచ్చుమర్రి పంప్ హౌస్, అప్రోచ్ కాలువ తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించినా బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. విచారణలో భాగంగా ఇప్పటికే ముగ్గురు అనుమానిత మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ వారి తల్లిదండ్రులను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి సమాచారం ఆధారంగా గాలింపు చేపట్టే అవకాశం ఉంది. ముగ్గురు మైనర్లే అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే బాలిక కోసం మూడో రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం తమ ఎనిమిదేళ్ల చిన్నారి కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు నందికొట్కూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్యచేసి ముచ్చుమర్రి పంప్‌హౌస్‌కు కొంతదూరంలో మృతదేహాన్ని పారేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ముచ్చుమర్రి ఎత్తిపోతల అప్రోచ్ కాలువలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.