ఎన్నికల కోడ్ కూసినా ఆగని అధికార పార్టీ రాజకీయ సమావేశాలు - ZPTC Meeting in Kadapa - ZPTC MEETING IN KADAPA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 2:55 PM IST

General Meeting of The Zilla Parishad is being criticized : ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కడపలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో తాగునీటి సమస్యపై చర్చించడానికి ఎన్నికల అధికారి అనుమతితో సమావేశం ఏర్పాటు చేశామని జెడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ సమావేశానికి  డిప్యూటీ సీఈవో రమణారెడ్డి,  వైఎస్సార్సీపీకి చెందిన పలువురు జడ్పీటీసీలు (ZPTC) లు, ఎంపీపీ (MPP) లు, జిల్లా అధికారులు హాజరయ్యారు. 

ZPTC Meeting in Kadapa : తాగునీటి సమస్యపై సమావేశం పెట్టినా నలుగురు సభ్యులు మాత్రమే మాట్లాడి మమ అనిపించారు. ఒకరిద్దరు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులు తెలుగుదేశం నేతలపై రాజకీయ విమర్శలు చేశారు. సమావేశం తీరును పరిశీలిస్తే జిల్లాలో తాగునీటి సమస్య ఉందా లేదా అనే సందేహం వ్యక్తం అవుతోంది. జెడ్పీ అధికారులు తీసుకొచ్చిన దస్త్రాలపై ఆకేపాటి సంతకాలు పెట్టారు. ఈ సమావేశం కేవలం సంతకాలు పెట్టడానికి నిర్వహించినట్లు ఉందని విమర్శలు వస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.