సీఎం జగన్‌కు తప్పని నిరసన సెగ - ఆకుపచ్చ జెండాలతో నినదించిన అమరావతి రైతులు - జగన్‌కు రాజధాని రైతుల నిరసన సెగ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 3:39 PM IST
|Updated : Jan 31, 2024, 4:40 PM IST
Formers Protest About Capital Amaravati In Guntur District : ముఖ్యమంత్రి జగన్‌కు రాజధాని రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయం వెళ్తున్న సమయంలో గుంటూరు మందడంలో రైతులు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని సీఎంకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సీఎం జగన్ (CM Jagan) వాహనశ్రేణి వెళ్తుండగా జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అమరావతికి మద్దతుగా ఆకుపచ్చ జెండాలు పట్టుకుని నినదించారు. రైతులు రోడ్డుపైకి రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Formers Protest in Front of CM Jagan : ఓ వైపు గ్రామాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యేలకు స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఇచ్చిన హామీలు విస్మరించారని, అభివృద్ధి పట్టించుకోలేదని, తాగు నీరు, రోడ్లు కల్పించలేదని ఎక్కడికక్కడ నిరసన తెలుపుతున్నారు ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్‌కు సైతం నిరసన తప్పలేదు. అమరావతి రాజధాని చేస్తానని విస్మరించారని భూమి ఇచ్చిన రైతులు మండిపడ్డారు.