బీఆర్ఎస్కు ఒడిదొడుకులు కొత్త కాదు : శ్రీనివాస్ గౌడ్ - Srinivas Goud on BRS - SRINIVAS GOUD ON BRS
🎬 Watch Now: Feature Video
Published : Jul 12, 2024, 8:03 PM IST
Srinivas Goud about BRS : తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఆ పార్టీని రాష్ట్ర ప్రజలే కాపాడుకుంటారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పార్టీని లేకుండా చేయడం ఎవరి తరం కాదని, బీఆర్ఎస్ను వీడుతున్న వారు నాయకత్వంపై విమర్శలు చేయడం సరికాదని హితువు పలికారు. తల్లి లాంటి పార్టీని విమర్శించవద్దని సూచించారు. రెండు ఎంపీ సీట్లు ఉన్న బీజేపీ ఇప్పుడు ఏ స్థాయికి చేరుకొందని, కాంగ్రెస్కు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకపోయినా అధికారంలోకి రాలేదా అని ఆయన ప్రశ్నించారు.
సొంత బలం మీద గెలిచామని అనుకుంటే పార్టీ మారుతున్న వారు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గొప్ప ఉద్యమ చరిత్ర ఉన్న, త్యాగాల పునాదుల మీద పుట్టిన బీఆర్ఎస్కు ఒడిదొడుకులు కొత్త కాదన్న ఆయన, ఉద్యమంలోనే తమ పార్టీని చంపాలని చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ వచ్చేదా ? కేసీఆర్ ఉద్యమం చేయకపోతే రాష్ట్రం ఇచ్చేవారా అని ప్రశ్నించారు.