రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయి - గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు - Jagan met Governor - JAGAN MET GOVERNOR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 21, 2024, 9:35 PM IST
Former CM Jagan met Governor Abdul Nazir at Raj Bhavan: గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను రాజ్‌భవన్‌లో మాజీ సీఎం జగన్ కలిశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని హత్యలు, దాడులతో రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విధ్వంసాల ఆధారాలు, వీడియోలను గవర్నర్‌కు సమర్పించినట్లు భేటీ అనంతరం వైసీపీ నాయకులు తెలిపారు.
దిల్లీలో ధర్నా: దిల్లీలో ఈనెల 24న నిర్వహించే ధర్నాలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులంతా పాల్గొనాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఇటీవల కోరారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించి రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను దేశం దృష్టికి తీసుకెళ్లేందుకే దిల్లీలో ధర్నా కార్యక్రమం చేపట్టామన్నారు. దీనికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గత 45 రోజులుగా ఏం జరుగుతుందో వారికి వివరిస్తామన్నారు. ధర్నా తర్వాత, పార్టీ ఎంపీలు పార్లమెంట్లో తమ గళం వినిపించాలని జగన్ సూచించారు.