జగన్ ఆవిష్కరించిన స్తూపం ధ్వంసం- శిలాఫలకం దిమ్మెను కూల్చివేసిన దుండగులు - Jagan Inaugurated Stupam Destroyed - JAGAN INAUGURATED STUPAM DESTROYED
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 9, 2024, 5:28 PM IST
Former CM Jagan Inaugurated Stupam Destroyed: రాజధాని గ్రామమైన కృష్ణాయపాలెంలో పేదలందరికీ ఇళ్ల కోసం అప్పటి సీఎం జగన్ ఆవిష్కరించిన స్తూపాన్ని, పైలాన్‌ను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతోపాటు పక్కనే ఉన్న శిలాఫలకం దిమ్మెను కూల్చివేశారు. దీనిపై సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు. రెండ్రోజుల క్రితమే ఈ ఘటన జరిగిందని పోలీసులు గుర్తించారు. అయితే దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవటంతో కేసు నమోదు చేయలేదని తెలిపారు.
"కృష్ణాయపాలెంలో అప్పటి సీఎం జగన్ జగన్ ఆవిష్కరించిన స్తూపాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతోపాటు పక్కనే ఉన్న శిలాఫలకం దిమ్మెను సైతం కూల్చివేశారు. దీనిపై సమాచారం అందిన వెంటనే మేం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాం. మా పరిశీలనలో రెండ్రోజుల క్రితమే ఈ ఘటన జరిగినట్లు గుర్తించాం. అయితే దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవటంతో కేసు నమోదు చేయలేదు" - పోలీసు అధికారులు