ఎర్రచందనం దుంగలను వదిలేసి పారిపోయిన స్మగ్లర్లు - Officials Seized Red Sandalwood - OFFICIALS SEIZED RED SANDALWOOD
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 7, 2024, 4:44 PM IST
Forest Officials Seized 32 Red Sandalwood Logs in Annamaya District : అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అటవీ అధికారులు అడ్డుకున్నారు. రోళ్లమడుగు-తుమ్మలబైలు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు శుక్రవారం అటవీ అధికారులకు సమాచారం వచ్చింది. రంగంలోకి దిగిన అధికారులు ఆకస్మికంగా కూంబింగ్ చేపట్టారు. అందులో భాగంగా ఆ ప్రాంతంలో ఎర్రదొంగలను తరలిస్తున్న వ్యక్తులను గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అందరూ పరారయ్యారని అధికారులు తెలిపారు. అక్కడే తరలించేందుకు సిద్ధంగా ఉన్న 32 ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులుకు స్వాధీనం చేసుకుని రాజంపేట ఫారెస్ట్ డిపోకు తరలించారు. ఇవి A-గ్రేడ్ ఎర్రచందనం దుంగలుగా గుర్తించామని అటవీ అధికారులు తెలిపారు. మార్కెట్లో వీటి విలువ సుమారు 2 లక్షల 75 వేలు ఉంటుందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నారాయణ తెలిపారు. ఎర్రచందనం కూలీలను పట్టుకునేందుకు యత్నించగా పరారయ్యారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.