వర్షాలతో పొంగిపొర్లుతున్న వాగులు - వరదల్లో చిక్కుకున్న గుబ్బల మంగమ్మ భక్తులు! - Gubbala Mangamma Devotees trapped
🎬 Watch Now: Feature Video
Gubbala Mangamma Devotees in Flood : రాష్ట్రంలో భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగుతున్నాయి. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కామవరం అడవిలోని గుబ్బలమంగమ్మ దేవాలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. దర్శనానికి వచ్చిన వాగులు పొంగడంతో భక్తులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సుమారు వంద మంది భక్తులు ఉన్నట్లు సమాచారం. అయితే భక్తులు గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్నట్లు చెబుతున్నారు. ఆలయ సమీపంలోని గుబ్బలమంగమ్మ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండం వల్ల బయటకు వచ్చేందుకు వీలు లేకుండా ఉంది. అయితే వీరంతా సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. గుబ్బలమంగమ్మ వాగు ఉద్ధృతి తగ్గితే గానీ భక్తులు బయటకు వచ్చేందుకు ఆస్కారం లేనట్లు సమీప గ్రామ ప్రజలు తెలిపారు.
Heavy Rains in Eluru : వర్షాలకు రేపల్లెవాడ కుంచవరం మధ్య కాజ్వేపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం వద్ద తూర్పు కాలువ ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. బుట్టాయిగూడెం మండలం జైనవారిగూడెం సమీపంలో కాలువలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఒక పాఠశాల బస్సు నిలిచిపోవడంతో స్థానికులు ట్రాక్టర్లు సహాయంతో బయటకు తీశారు. అయితే విద్యార్థులు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.