'ఏపీకి జగన్ ఎందుకు కావాలి' సభలో తీవ్ర ఉద్రిక్తత - ఎమ్మెల్యేను అడ్డుకున్న జనసేన నాయకులు - Tension in Bapatla district
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 26, 2024, 11:52 AM IST
Flexi Dispute in Bapatla District : బాపట్ల జిల్లా భీమవారిపాలెంలో వైఎస్సార్సీపీ నిర్వహించిన 'ఏపీకి జగన్ ఎందుకు కావాలి' సభ ఉద్రిక్తతకు దారితీసింది. సభ నిర్వహణ కోసం మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ ఫ్లెక్సీని వైసీపీ నేతలు వెనక్కి తిప్పడంతో జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రసంగిస్తుండగానే జనసేన జిల్లా కార్యదర్శి తులసి కుమారి, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అనంతరం అన్నం సతీష్ ప్రభాకర్ ఫ్లెక్సీకి జనసేన నేతలు పాలాభిషేకం నిర్వహించారు.
Clash of JanaSena and YCP Leaders : సభ ముగించుకొని కారు ఎక్కడానికి వచ్చిన ఎమ్మెల్యే కోన రఘుపతిని జనసేన నాయకులు అడ్డుకుని నిరసన తెలిపారు. ఆయన చుట్టూ చేరి నినాదాలు చేశారు. అన్నం ప్రభాకర్ ఫ్లెక్సీని ఎందుకు వెనక్కి తిప్పారని నిలదీశారు. ఈ క్రమంలో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన లాభం లేకపోయింది. ఎట్టకేలకు ఎమ్మెల్యే వారికి సర్ది చెప్పడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు.